తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కట్టి తీరుతాం..

ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రూ.18.7 కోట్ల అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన-విజయోత్సవ బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. "రెండేళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నా. రెండేళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తిచేసుకుంటోంది. సంక్షేమం-అభివృద్ధి రెండుకళ్లుగా భావిస్తూ ముందుకెళ్తున్నాం. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టి తీరుతాం. ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గనులు ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ కంపెనీని మళ్లీ ప్రారంభిస్తాం. ఏడాదిలో ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ పనులు ప్రారంభిస్తాం. ఎర్ర బస్సు రావడం కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్‌బస్ తీసుకొస్తున్నాం. అత్యంత వెనకబడిన ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా" అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
-
Home
-
Menu
