ఎవరు అడ్డంపడినా.. అభివృద్ధి ఆగదు

మన తెలంగాణ/వికారాబాద్ బ్యూరో: రాష్ట్రానికి అప్పులున్నా.. సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఎవరు ఎంతగా అడ్డంపడినా.. అభివృద్ధి పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చే శారు. శనివారం వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని నారాయణపూర్‌లో ‘ప్రజా పాలన- ప్రగతి బాట’ బహిరంగ సభకు హాజరు అయ్యి ప్రజలను ఉద్దేశించి ముఖ్య మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్, మోదీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గు ప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చీకటి ఒప్పందాలతో, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని మండి పడ్డా రు. సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లాకు నిధులు కేటాయించకుండా తీరని అ న్యాయం చేశారని మర్శించారు. సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వస్తుందని మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీళ్లు పారిస్తాం
రంగారెడ్డి జిల్లాకు నీటి సౌకర్యాన్ని కల్పించే అవసరం ఉందన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు గోదావరి నీటిని ఖచ్చితంగా తీసుకువస్తానని సీఎం హామీ ఇచ్చారు. కాగ్నా నది ప్రాజెక్ట్ ద్వారా తాండూర్ ప్రాంత ప్రజలకు నీటి సౌకర్యాన్ని కల్పిస్తానని తెలిపారు. ఇక్కడి ప్రాంతానికి ఎన్ని కోట్ల నిధులు కావాలంటే అన్ని నిధులను వెచ్చించి అయిన రోడ్ల నిర్మాణాల పనులను చేపడతామన్నారు. మూసి ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ముందుకు వస్తె దాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం వచ్చాకే అందరికి రేషన్ కార్డులు
ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వేల కుటుంబాలకు రేషన్ కార్డులను ఇచ్చి అర్హులైన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని సీఎం తెలిపారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ అధికారంలో, 12 సంవతసరాలు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి మున్సిపాలిటీలకు నిధులు కేటాయించలేదని అన్నారు. ఏక్కడ కూడా అభివృద్ధి చేయలేదని, ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీపై కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీలు మున్సిపాలిటీలకు నిధులు కేటాయించి ఉంటే ఓట్లకోసం వంగి దండాలు పెట్టే దుస్థితి ఎందుకు వస్తుందని అన్నారు. మోదీకి ఓటు వేస్తే , మున్సిపాలిటీకి వచ్చిన నిధులు ఇస్తారా అని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లాకు గోదావరి నీళ్లు పారిస్తామని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టి, మల్లన సాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులను కట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ రోజమ్మ చేసిన రొయ్యల పులుసు తిని రాయల సీమను రత్నాల సీమను చేస్తాని చెప్పి రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టాడని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా అడ్డుకున్నాని, తమ ప్రభుత్వం గ్రూప్ -1 ఉద్యోగాలు ఇస్తే వాటిని కూడా కోర్టులో కేసు వేసి అడ్డుకున్నారు అన్నారు. కేసీఆర్ తన అల్లుని, కొడుకును మంత్రిని చేశాడు. బిడ్డను ఎమ్మెల్సీ, సడ్డకుని కొడుకుని ఎంపీ మాత్రం చేశాడని ఆరోపించారు. అప్పుడే దిగిపో దిగిపో అంటున్నారు.
రంజిత్‌రెడ్డిని మంత్రిని చేస్తా
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి మున్సిపల్ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తాను.. జిల్లాకు ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు మంజూరు చేస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రంజిత్‌రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొంది ఉంటే కేంద్రం నుంచి ఎన్ని నిధులైనా తెచ్చి ఇక్కడి ప్రాంతానికి కేటాయించి అభివృద్ధి చేసేవారని అన్నారు.
చంద్రశేఖర్‌రావు, కల్వకుంట్ల కిషన్‌రావు రాసిపెట్టుకోండి..
రాబోయే 8 సంవత్సరాలు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలనే ఉంటుంది. ఈ పాలనలో రిజనల్ రింగ్ రోడ్డు పూర్తి చేసుకుంటాం. మక్తల్ నారాయణపేట ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసుకుంటాం. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్మించుకుంటాం. కృష్ణా రైల్వే నిర్మాణం పూర్తి చేసుకుంటాం. వికారాబాద్‌ను అంతర్జాతీయ టూరిజం ప్రాజెక్టు చేస్తాం. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ, మన్నెగూడ నుంచి తాండూరు వరకు రోడ్డును పూర్తి చేసుకుంటాం. మీ తాతలు దిగి వచ్చినా.. ఈ పనులు ఆపేదిలేదని స్పష్టం చేశారు. అనంతరం జిల్లాలోని 6650 స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరా మహిళా శక్తి 567.69 కోట్ల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసన మండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు టి.రామ్మోహన్ రెడ్డి, బియ్యని మనోహర్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
-
Home
-
Menu
