రేపు నర్సంపేటకు సిఎం రేవంత్

Cm Revanth Reddy Slams Kishan Reddy And KTR
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రజా పాలన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగే ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సిఎం హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 1 గంటకు నర్సంపేట పట్టణ సమీపంలోని మెడికల్ కళాశాల దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగనున్నారు. అక్కడ నుంచి కిలోమీటరు దూరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. మొదటగా సుమారు రూ.600 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సిఎం శంకుస్థాపన చేసి మరో రూ. 400 కోట్ల ప్రతిపాదిన నిధులను ప్రకటించనున్నారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగం, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
Home
-
Menu
