ముఖ్యమంత్రి రాకకు ముస్తాబైన మేడారం

CM Revanth Reddy tour in Medaram
వనదేవతల సన్నిధిలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు.
ములుగు: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకోనున్నారు. సమ్మక్క–సారలమ్మ వనదేవతలను సిఎం దర్శించుకోనున్నారు. అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించనునన్నారు. మేడారం సన్నిధిలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ చేయడంతో పాటు ప్యూరిఫైయర్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు మేడారంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆలయ ప్రాంగణం రంగురంగుల పూలతో విరాజిల్లుతుంది. వనదేవతల గద్దెలకు వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేయడంతో పాటు ఆలయ పరిసరాల్లో పూలతోరణాలు, ఆకర్షణీయంగా అలంకరణలున్నాయి. బారికేడింగ్‌తో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. హెలిప్యాడ్ నుంచి వనదేవతల ప్రాంగణం వరకు సిఎం రేవంత్ కు పటిష్ట భద్రత ఉం టుందని పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో మేడారంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags
-
Home
-
Menu
