మున్సిపల్ ఎన్నికలు.. వారికే బీఫాం ఇవ్వండి: సిఎం రేవంత్

Revanth Reddy
X

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జూమ్ సమావేశం ముగిసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సిఎం రేవంత్.. శనివారం మున్సిపల్‌ ఎన్నికలపై పిసిసి చీఫ్‌ మహేష్‌గౌడ్‌, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులతో ఆయన జామ్‌ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికలపై మంత్రులకు సిఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు.

"నాయకులు తమకు నచ్చిన వాళ్లకు కాకుండా ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు బీఫాం ఇవ్వండని సిఎం చెప్పారు. సమష్టిగా పని చేస్తే విజయం సాధిస్తామని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు రుజువు చేశాయని తెలిపారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో కలిసి పనిచేసి విజయం సాధించాం. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా నాయకులు అంతా కలిసి పని చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇప్పుడే చైర్మన్‌, మేయర్‌లను ప్రకటించకండి. సామాజిక సమీకరణాల ప్రకారం చైర్మన్‌లను ఎంపిక చేయాల్సి ఉంటుంది" అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

Tags

Next Story