కారు ఇంజన్ లోకి దూరిన నాగుపాము

కారు ఇంజన్ లోకి దూరిన నాగుపాము
X

కారు ఇంజన్ లోకి పాము దూరిన సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బుదేరాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. తాటిపల్లి గ్రామనికి చెందిన చంద్రయ్య బుదేరాలోని ఓ టీ స్టాల్ వద్ద టీ తాగుతుండగా నాగుపాము కారు కిందకి వెళ్లి బయటకు రాలేదు. అది గమనించిన చంద్రయ్య వెంటనే కారు స్టార్ట్ చేశాడు. అయినా పాము బయటకు రాక కారు ఇంజన్ లోకి దూరింది. దీంతో చంద్రయ్య పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించాడు. పాములు పట్టే వ్యక్తి కారు వద్దకు వచ్చి గంటకు పైగా శ్రమించి కారు ఇంజన్ లోంచి పామును బయటకు తీశాడు.

Tags

Next Story