పోలీసు కారుకు శవపేటిక కట్టి గ్రామస్థుల ఆందోళన

పోలీసు కారుకు శవపేటిక కట్టి గ్రామస్థుల ఆందోళన
X

మన తెలంగాణ/ నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ జిల్లా, ఎర్గట్ల మండలం, దోమచంద్‌లో యువకుడి ఆత్మహత్య ఉదంతంతో పోలీస్ శాఖ లో ఉన్నత స్థాయి అధికారులు సైతం ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్గట్ల మండలం, దోమచంద్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి (29) ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అ క్కడే స్థిరపడ్డాడు. ఇక్కడ ఉన్నప్పుడే అంటే ఆరేళ్ళ క్రితం తన సామాజికవర్గానికి చెందిన ఏర్గట్ల గ్రా మానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డా డు. కుటుంబ సభ్యులు సైతం వీరిద్దరి ప్రేమకు సా నుకూలత వ్యక్తం చేశారు. ఇంకేముంది ప్రేమించి అమ్మాయితో పెండ్లికి లైన్ క్లియర్ అయిందని ఎం తో సంబరపడ్డాడు. ఆ కుటుంబానికి ఆర్థికంగా తనకు తోచిన మేరకు అండగా ఉంటూ వచ్చాడు. లండన్ నుండి పెళ్ళి పేరుతో ఇండియాకి రప్పించారు. ప్రేమించిన అమ్మాయితో పెండ్లి ఆశలు పెట్టుకొని స్వగ్రామానికి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చిన ఆ యువకుడికి అమ్మాయి షాక్ ఇచ్చింది. ఆర్థికంగా మరింత బలమైన సంబంధం ఖరారు చేసుకున్నారు. చివరికి వేరే అబ్బాయితో ఈ నెల లో పెళ్లి చేయడానికి సిద్ధం చేశారు.

కానీ ఆ పెం డ్లికి ఒక్కరోజు ముందే శ్రీకాంత్‌రెడ్డి ఈనెల 6న ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయ త్నం చేశాడు. సూసైడ్ నోటు కూడా రాశాడు. ఇదే విషయమై బాధిత కుటుంబ సబ్యులు అదే రోజున ఎర్గట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శ్రీకాంత్‌రెడ్డిని హుటాహుటిన హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మరణించాడు. ఇంత జరిగినా పోలీసులు తమకేమీ సోయే లేదన్నట్లుగా వ్యవహరించారు. అందుకే ఉదాసీనతకు తగిన మూల్యం శుక్రవారం చెల్లించుకోక తప్పలేదు. బాధితుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన మృతదేహాన్ని పోలీస్ వాహనం మీదికి ఎక్కించారు. మృతుడి బంధువులు, గ్రామస్థులు శవంతో కలిసి పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించగా మధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈఘటనతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డెక్కి వందలాది మంది పోలీసుల వైఫల్యాలపై దుమ్మెత్తిపోశారు. ఖాకీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చివరికి తగిన న్యాయం చేస్తామని సూసైడ్ నోట్ మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags

Next Story