మండల అధ్యక్షుల ఎంపికలో కాంగ్రెస్ నాయకుల డిష్యూం... డిష్యూం

ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా తొమ్మిది మండలాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రకటించి నియామక పత్రాలు అందించడంతో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం, ఎమ్మెల్యే వర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం మాజీ మంత్రి దామోదర్ రెడ్డి వర్గం నలభై సంవత్సరాలుగా జాజిరెడ్డిగూడెం మండలంలోని నిరంతరం ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దరూరి యోగానందచార్యుల అధ్వర్యంలో కార్యకర్తలకు అండగా నిలిచారు. గత కొంతకాలంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ గెలిచిన నుండి ఇరువర్గాల మధ్య సమన్వయ లోపంతో ఏదో ఒక కారణంతో ఘర్షణలు కొనసాగుతున్నాయి. కష్టపడే వారికే పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాలు వెలువడుతుంటే ఇటీవల వచ్చిన పార్టీ నాయకులకు పార్టీ పదవులు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సహకారంతో అందించారు.
దానిని దృష్టిలో ఉంచుకుని ఆదివారం రోజు కొమ్మాలలో కార్యకర్తల సమావేశం నిర్వహించి అర్వపల్లి మెయిన్ చౌరస్తాలో రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. తొమ్మిది మండలాల కాంగ్రెస్ నాయకులు బుధవారం గాంధీభవన్‌కు తరలివెళ్లి ధర్నా నిర్వహించడానికి వెళ్తున్న నేపథ్యంలో ఇటీవల ఎన్నికైన మండల అధ్యక్షులు అర్వపల్లి చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లవద్దని అడ్డుతిరిగి గొడవ జరగడంతో ఒక్క సారిగా ఇరుకాంగ్రెస్ కార్యకర్తలు కర్రలతో, రాళ్లతో ఒకరిపై ఒకరు ఘర్షణ పడడంతో అర్వపల్లి చౌరస్తా రణరంగంగా మారింది. ఈ ఘర్షణలో పలువురికి స్వల్పగాయాలు కాగా కాంగ్రెస్ నాయకుల కారు, మరికొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఇరువర్గాలను చెదరగొట్టేందుకు సిఐ. నాగేశ్వర్ రావు, ఎస్‌ఐ. మధునాయుడు స్వల్ప లాఠీచార్జీ చేశారు. ఇరువర్గాలను ఎక్కడికక్కడే చెదరగొట్టి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంఘటనా స్థలాన్ని పరీశీలించిన డిఎస్‌పి
అర్వపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఇరువురి నాయకుల మధ్య గొడవలు జరుగుతుండడంతో సూర్యాపేట డిఎస్‌పి. ప్రసన్నకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఎవరు కూడా గొడవలు, దాడులు చేసుకోవద్దని ఏమైనా సమస్యలు ఉంటే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులకు తెలియజేయాలే తప్ప దాడులు చేసుకోవద్దని వారు సూచించారు.
-
Home
-
Menu
