సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య

Man killed by brother after land issue in Ibrahimpatnam
సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామ శివారులో పట్టపగలే కాంగ్రెస్ నేత బాల్ రెడ్డి(50) హత్యకు గురవ్వడం కలకలం రేపుతోంది.. వివరాల్లోకి వెళితే...శుక్రవారం మధ్యాహ్నం దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి తన పనుల కోసం బాల్ రెడ్డి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి బైక్ పై చెల్లాపూర్ వెళ్తుండగా రాజక్కపేటగ్రామ శివారులో కొంత మంది దుండ గులు ఆయనపై కత్తులతో అత్యంత కిరాతకంగా దాడిచేశారు. దీంతో ఆయన వారిని ఆపేప్రయత్నిస్తుండగానే పలు మార్లు కత్తులతో దాడి చేశారు. ఈ క్రమంలో ఆయనను పలు మార్లు పొడవడంతో రక్తపుమడుగులో కుప్ప కూలిపోయాడు. ఈ ఘటనతో అక్కడున్న వారు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఆగం తకులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటన స్థలంకు చేరుకున్నారు. క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపారు. ఈ హత్యకు రాజకీయా కోణాలు ఉన్నాయా?..లేదా భూముల తగాదాలు ఏమైన ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తంగా సిద్దిపేటలో కాంగ్రెస్ నేత హత్యకు గురవ్వడం ప్రస్తుతం ఒక్కసారిగా తీవ్ర ఆందోళనలు రేపింది.
-
Home
-
Menu
