గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలాడుతోంది: కవిత

X
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ విచారణను తప్పు పడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మాట్లాడటం సరికాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. చట్టాలను అందరూ గౌరవించడంతో పాటు సహకరించాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను సిటి విచారించిన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండేళ్లు అవుతున్నా సిట్ విచారణ ఎందుకు ముగియడం లేదని ప్రశ్నించారు. దోషులకు శిక్షపడేలా చూడాలని, గుంట నక్కలతో కలిసి కాంగ్రెస్ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. తనతో పాటు తన భర్త ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, విచారణకు సిట్ అధికారులు పిలిస్తే వెళ్లతానని కవిత స్పష్టం చేశారు. సిట్ విచారణలో ఏం జరిగిందే మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చెబుతారన్నారు.
Next Story
-
Home
-
Menu
