ఉత్తర భారతదేశ రాజకీయాల మార్చే సభ సిరిసిల్ల సభ

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదు..
మంత్రి శ్రీధర్ బాబు..
యువరాజు కోటను బద్దలు కొడుతాం..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
సిరిసిల్లలో ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లపై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో మంత్రులు..
రాజన్న సిరిసిల్ల: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈనెల 30న నిర్వహించి సిరిసిల్ల సభ ఉత్తర భారత దేశ రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చే సభ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం సిరిసిల్లలో సాయి మణికంఠ గార్డెన్స్ లో ముఖ్యమంత్రి సభ జన సమీకరణ పై కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ చార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఐటీ పరిశ్రమల శాఖ శ్రీధర్ బాబు, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ లు ఆది శ్రీనివాస్, విజయ రమణారావు తో పాటు సిరిసిల్ల జిల్లా లో వివిధ మండలాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో తీసుకురావడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి మార్పుతో దక్షిణ భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చాయని మంత్రి తుమ్మల అన్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి గారు సిరిసిల్లలో నిర్వహించే సభతో ఉత్తర భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు వచ్చే విధంగా సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నిక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు మోడల్ గా నిలుస్తున్నాయని బిజెపి ఫలిత రాష్ట్రాలు సైతం తెలంగాణ తరహా పథకాలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో చేసిన అప్పులు ఆర్థిక వ్యవస్థ విచ్చిన్నంగా తయారైనప్పటికీ ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఆత్మహత్యలకు నిలయంగా ఉన్న సిరిసిల్లను ఆత్మహత్యల విముక్తి ప్రాంతంగా చేయడంతో పాటు చేతినిండా పని కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని మంత్రి తుమ్మల అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పెట్టిన కేసులు వేసే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తామని మంత్రి తుమ్మల వివరించారు. దేశ రాజకీ యాలను మార్చే సిరిసిల్ల సభకు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పిలుపునిచ్చారు.
కేటీఆర్ మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి శ్రీధర్ బాబు
పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్ కు లేదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుండి 18 మంది ఎమ్మెల్యేలు గెలుపొందితే 13 మంది ఎమ్మెల్యేలను కేటీఆర్ పార్టీలో చేర్చుకొని పదవులు ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇలాంటి కేటీఆర్ కు పార్టీ ఫిరాయింపుల పై మాట్లాడే నైతిక హక్కు లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు హామీలు ఇచ్చి నెరవేర్చక పోవడంతో కేటీఆర్ నాయకత్వం విభేదించి అనేకమంది తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే చేరారని శ్రీధర్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు అన్నారు. తొమ్మిది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ హరీష్ రావు తో పాటు వారి నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీధర్ బాబు మండిపడ్డారు. వేములవాడ నియోజకవర్గ పోరాట స్ఫూర్తి కొనసాగిస్తూ వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 30వ తేదీన సిరిసిల్లలో నిర్వహించే ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సభకు పెద్ద సంఖ్యలో జనం సమీకరణ చేయా
యువరాజు కోట బద్దలు కొట్టాలి: మంత్రి అడ్లూరి..
బీఆర్ఎస్ పార్టీలో యువరాజుగా పిలవబడే మాజీ మంత్రి కేటీఆర్ కోటను బద్దలు కొట్టి వచ్చే ఎన్నికల్లో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 30వ తేదీన జరిగే సభ పునాదిగా మారుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సిరిసిల్ల 1989 నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఇప్పటి వరకు గెలవలేదని అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కార్యకర్తలపై అనేక కేసులు నమోదు అయ్యాయని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని మంత్రి పిలుపునిచ్చారు. నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తూ సభను విజయవంతం చేయాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ కోరారు.
కార్యకర్తలు కంకణ బద్ధులై ముందుకు సాగాలి..
సిరిసిల్లలో నిర్వహించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కంకణ బద్ధులై ముందుకు సాగి దేనా సమీకరణ చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
లక్ష మందితో ముఖ్యమంత్రి సమావేశం..
ఈనెల 30వ తేదీన సిరిసిల్లలో నిర్వహించి ముఖ్యమంత్రి సభ లక్ష మందితో నిర్వహిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇంటింటికి తిరిగి జన సమీకరణ చేయాలని పిలుపునిచ్చారు.
Tags
-
Home
-
Menu
