కల్వకుర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ జయకేతనం

Congress
X

కల్వకుర్తి: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అధిక శాతం మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 77 మున్సిపాలిటీల్లో విజయం సాధించగా.. బిఆర్ఎస్ 13, బిజెపి 1, ఎంఐఎం 1 స్థానంలో గెలిచాయి. ఇక కల్వకుర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో బృంగి రత్నమాలను కాబోయే మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ 13+1=14(1 కాంగ్రెస్ రెబెల్) స్థానంలో విజయం సాధించగా.. బిఆర్ఎస్ 3, బిజెపి 5 స్థానాల్లో గెలిచాయి.


గెలిచిన వారి వివరాలు:

1వ వార్డు.. బిజెపి.. శ్రీరామ్

4వ వార్డు.. కాంగ్రెస్.. హుమ్లి హనుమ నాయక్

7వ వార్డు.. కాంగ్రెస్.. బృంగి రత్నమాల

10వ వార్డు.. కాంగ్రెస్.. షేక్ ఎజాస్

13వ వార్డు.. బిజెపి.. బోడ నరసింహ

16వ వార్డు.. కాంగ్రెస్.. పసుల లలిత

19 వ వార్డు.. బిఆర్ఎస్.. ఎండి షాహిద్

21 వ వార్డు.. కాంగ్రెస్.. మబ్బు రామరాజు

17 వార్డు.. కాంగ్రెస్.. షానవాజ్ ఖాన్

14 వార్డు.. బిఆర్ఎస్.. భావండ్ల మంజుల మధు

22 వార్డు.. కాంగ్రెస్.. రాజేష్

8 వార్డు.. కాంగ్రెస్ రెబల్.. లలిత గణేష్

5 వార్డు.. కాంగ్రెస్.. కరుణాకర్ రెడ్డి

20 వార్డు.. కాంగ్రెస్.. లలిత శ్రీకాంత్ రెడ్డి

11 వార్డు.. బిజేపి.. రామకృష్ణ

3 వార్డు.. బిఆర్ఎస్.. కేతవత్ రాము నాయక్

9 వ వార్డు.. కాంగ్రెస్.. చిత్తారి ఎల్లమ్మ శ్రీనివాస్

6 వ వార్డు.. కాంగ్రెస్.. రేణుక రాజశేఖర్

18 వ వార్డు.. కాంగ్రెస్.. నాజియా మగ్బుల్

15 వ వార్డు.. కాంగ్రెస్.. అస్మిత చంద్రకాంత్ రెడ్డి

12 వ వార్డు.. బిజెపి.. జ్యోతి రాంభూపాల్ రెడ్డి

Tags

Next Story