మక్తల్ మున్సిపాటిలో కాంగ్రెస్ విజయభేరీ

నారాయణపేట: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎక్కువ శాతం మున్సిపాలిటీలను అధికార కాంగ్రెస్ కైవసం చేసుకుంటోంది. ఇక నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో 16 వార్డులు ఉండగా 6వ వార్డు బిజెపి అభ్యర్థి మృతి చెందడంతో ఎన్నిక వాయిదాపడింది. 15 వార్డులకు ఎన్నికలు జరగగా మక్తల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 12
బిజెపి 03 స్థానాల్లో గెలవగా.. బిఆర్ఎస్ ఒక స్థానం కూడా గెలవలేకపోయింది.
మక్తల్ మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులు
1)రాజశేఖర్ రెడ్డి (బిజెపి)
2) టప్ప కృష్ణయ్య (బిజెపి)
3) మహేష్ (కాంగ్రెస్)
4) కావలి నరసింహ (బిజెపి)
5) వెంకటేష్ (కాంగ్రెస్)
7) కలాల్ శ్రీవిద్య (కాంగ్రెస్)
8) జట్ల అనిత (కాంగ్రెస్)
9) శైవి రెడ్డి (కాంగ్రెస్)
10) కర్రెం చెన్నమ్మ (కాంగ్రెస్)
11) నహీద బేగం (కాంగ్రెస్)
12) రహీం పటేల్ (కాంగ్రెస్)
13) మక్తల్ సరిత (కాంగ్రెస్)
14) వాకిటి మానస (కాంగ్రెస్)
15) కోళ్ల సంధ్య (కాంగ్రెస్)
16) అల్కూరి పావని (కాంగ్రెస్)
-
Home
-
Menu
