జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గ్రాండ్ విక్టరీ

Naveen Yadav
X

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తన సమీప ప్రత్యర్థి, బిఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై 24 వేల 658 ఓట్ల తేడాతో గెలుపొందారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజారిటీ కావడం విశేషం. ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచి ప్రతీ రౌండ్‌లోనూ నవీన్ యాదవ్ ఆధిక్యంలోనే ఉన్నారు. ఏ ఒక్క రౌండ్‌లోనూ సునీతకు ఆధిక్యం రాలేదు. అయితే నవీన్ యాదవ్ విజయాన్ని ఇసి ఇంకా ప్రకటించలేదు. బిఆర్ఎస్, బిజెపిలకు 2023 ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. బిజెపికి డిపాజిట్‌ గల్లంతైంది.

Next Story