బాన్సువాడ మున్సిపల్‌పై జెండా ఎగురవేసిన కాంగ్రెస్

బాన్సువాడ మున్సిపాలిటిపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. 19 వార్డులకు గాను 11 వార్డులను కైవసం చేసుకోగా, ఈ సారి బీజెపీ పుంజుకుని 3 స్థానాల్లో విజయం సాధించగా, మరో 3 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుచుకుంది. అలాగే స్వతంత్య్ర అభ్యర్థి ఒకరు గెలుపొందగా, మరో స్థానంలో ఎంఐఎం గెలిచింది.బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు అన్ని పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్య్ర అభ్యర్థికి సైతం మద్దతు తెలిపి గెలిపించారు. 1వ వార్డులో అభ్యర్థిని నస్రీన్ బేగం (బీఆర్‌ఎస్), 2వ వార్డులో జంగం రాజశేఖర్ (కాంగ్రెస్), 3వ వార్డులో అబ్దుల్ హకీం (కాంగ్రెస్), 4వ వార్డులో గైక్వాడ్ రుక్మిణి (కాంగ్రెస్), 5వ వార్డులో విజయ కాసులవార్ (కాంగ్రెస్), 6వ వార్డులో అంజుం బేగం (బీఆర్‌ఎస్), 7వ వార్డులో సామల మానస (బీజెపీ), 8వ వార్డులో శ్యామల దోన్కంటి (కాంగ్రెస్), 9వ వార్డులో పాశం ఆమని (బీజెపీ),
10వ వార్డులో జగన్నాథం నగేష్ (కాంగ్రెస్), 11వ వార్డులో గదుమల లింగమేశ్వర్ (కాంగ్రెస్), 12వ వార్డులో గడ్డమీది అంజా గౌడ్ (స్వతంత్య్ర అభ్యర్థి), 13వ వార్డులో అబ్దుల్ ఖాలెక్ (కాంగ్రెస్), 14వ వార్డులో నార్ల వసంత (కాంగ్రెస్), 15వ వార్డులో వంకర్ రమేష్ (కాంగ్రెస్), 16వ వార్డులో గజ్జల మహేష్ (బీజెపీ), 17వ వార్డులో మహమ్మద్ ఫర్హానాజ్ (ఎంఐఎం), 18వ వార్డులో రేష్మా బేగం ఎజాజ్ (కాంగ్రెస్), 19వ వార్డులో యం.డి. మక్బూర్ (బీఆర్‌ఎస్) గెలుపొందారు. మొత్తంగా కాంగ్రెస్ 11 స్థానాల్లో బీజెపీ 3, బీఆర్‌ఎస్ 3, స్వతంత్య్ర 1, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపొందారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింగా, 76 ఓట్లు పోలయ్యాయని, ఆయా వార్డుల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేసినట్లు అధికారులు తెలిపారు.
-
Home
-
Menu
