కల్వకుర్తి పురపాలకంలో హస్తం కైవసం

ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోని మూడు ప్రధాన పార్టీలు పోరాటం చేసిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కల్వకుర్తి పురపాలక సంఘం లో హస్తం హవా నడిచింది.గత పాలకమండలి లో పని చేసిన బిఆర్‌ఎస్ కారు స్పీడు తగ్గి కమలం వికసించింది.ఈ నెల 11 జరిగిన కల్వకుర్తి మున్సిపల్ రెండో సాధారణ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి.స్థానిక బిఈడి కళాశాలలో ఉదయం 8 గంటలకు మూడు రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియను చేపట్టారు.ఈ ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 13 వార్డులలో,కాంగ్రెస్ రెబల్ ఇండిపెండెంట్ ఒక వార్డులో,బిఆర్‌ఎస్ పార్టీ 3 వార్డులలో,బారతీయ జనతా పార్టీ 5 స్థానాలలో గెలుపొందింది. విజయం పొందిన అభ్యర్దుల వివరాలు ఇలా.. 1 వార్డు లో బాజపా అభ్యర్ది శ్రీరాములు 35 ఓట్ల మెజార్టీతో,2 వార్డు లో బాజపా అభ్యర్ది రేణుక 182 ఓట్ల మెజార్టీతో,3 వ వార్డు లో బిఆర్‌ఎస్ అభ్యర్ది కేతావత్ రాము 29 ఓట్ల మెజార్టీతో ,4 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది హుమ్లి హనుమా నాయక్ 116 ఓట్ల మెజార్టతో ,5 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది కరుణాకర్ రెడ్డి 201 ఓట్ల మెజార్టీతో,6 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది పుట్ట రేణుక 118 ఓట్ల మెజార్టీతో,7 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ చైర్మెన్ అభ్యర్ది బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ తమ ప్రత్యర్ది 425 ఓట్ల బారీ మెజార్టీతో గెలుపొందారు.
అదే విదంగా 8 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ రెబల్ ఇండిపెండెంట్ అభ్యర్ది కోడెల లలిత గణేష్ 16 ఓట్ల మెజార్టీతో,9 వ వార్డు లో కాంగ్రెస్ అభ్యర్ది చిత్తారి ఎల్లమ్మ 122 ఓట్ల మెజార్టీతో ,10 వార్డు లో బిఆర్‌ఎస్ అభ్యర్ది ఎజాస్ ఒక ఓటు మెజార్టీతో,11 వ వార్డు లో బాజపా అభ్యర్ది ఎనుగొండ రామకృష్ణ 7 ఓట్ల మెజార్టీతో,12 వ వార్డు లో బాజపా అభ్యర్ది గుర్రాల జ్యోతి రాంభూపాల్ రెడ్డి 65 ఓట్ల మెజార్టీతో,13 వ వార్డులో బాజపా అభ్యర్ది బోడ నర్సింహ్మ 63 ఓట్ల మెజార్టీతో ,14 వ వార్డు బిఆర్‌ఎస్ అభ్యర్ది బావండ్ల మంజుల 124 ఓట్ల మెజార్టీతో,15 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కుడుముల అస్మిత చంద్రకాంత్‌రెడ్డి,16 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది పసుల లలిత కిరణ్ కుమార్ రెడ్డి,17 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది షాన్‌వాజ్ ఖాన్ 119 ఓట్ల మెజార్టీతో ,18 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది నాజియా మక్బుల్ 82 ఓట్ల మెజార్టీతో ,19 వ వార్డు లో బిఆర్‌ఎస్ అభ్యర్ది షాహెద్ 32 ఓట్ల మెజార్టీతో ,20 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది చిమ్ముల లలిత శ్రీకాంత్ రెడ్డి 510 ఓట్ల బారీ మెజార్టీతో,21 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది మబ్బు రామరాజు 159 ఓట్ల మెజార్టీతో ,22 వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ది కొల్లోజు రాజేష్ 101 ఓట్ల మెజార్టీతో తమ ప్రత్యుర్దు ల పై గెలుపొందారు.
గెలుపొందిన విజేతలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికైనట్లు పత్రాలను అందజేశారు.గెలుపొందిన చైర్మెన్ అభ్యర్ది బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ను కల్వకుర్తి ఎంఎల్‌ఏ కసిరెడ్డి నారాయణరెడ్డి అభినందించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం నుండి ఎంఎల్‌ఏ క్యాంపు కార్యాలయం వరకు పెద్ద ఎత్తున బాణా సంచా కాలుస్తూ డీజే సౌండ్స్ మద్యన నృత్యాలు చేస్తూ ,స్వీటు మిఠాయిలు తినిపించుకుంటూ శాలువాలతో సన్మానిస్తూ సంబరాలు జరుపుకున్నారు.అదే విదంగా బాజపా ఎప్పుడు లేని విదంగా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇచ్చి బిఆర్‌ఎస్ మూడో స్థానానికి నెట్టి ప్రతి పక్షం రావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు.
-
Home
-
Menu
