భూపాలపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ విజయబేరి

Congress
X

భూపాలపల్లి జిల్లాలో ఉన్న ఒక్క భూపాలపల్లి మున్సిపాల్టీ ఎన్నికల్లో 16సీట్లు గెలుచుకొని అధికార కాంగ్రెస్‌పార్టీ విజయకేతనం ఎగరవేసింది. భూపాలపల్లిలోని మొత్తం 30వార్డులకు గాను కాంగ్రెస్ సిపిఐ, సిపిఎం మిత్రపక్షాలతో కలిసి 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది, సిపిఐ 4. సిపిఎం1 స్థానాల్లో పోటీచేసింది. 16 కాంగ్రెస్ గెలువగా, సిపిఐ ఒక్క స్థానం గెలిచింది. బీఆర్‌ఎస్ 25 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో గెలిచింది. బిజెపి 20కి పైగా పోటీచేసి రెండు స్థానల్లో గెలిచింది. 23 వార్డు లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. గెలిచిన అభ్యర్థులు పార్టీలవారిగా 1 వ వార్డు బౌత్ శోభ రాజేష్. (కాంగ్రెస్), 2 వ వార్డు బుర్ర కొమురయ్య గౌడ్. (కాంగ్రెస్),3 వ వార్డు. ఎరవెల్లి జగపతి. (అరుణ్ రావు) (కాంగ్రెస్), 4 వ వార్డు. కన్నం యుగదీశ్వర్ బిజెపి, 5 వ వార్డు కట్ల పూర్ణ చందర్ బిఆర్‌ఎస్, 06 వ వార్డు. ఎరుకల రేణుక గణపతిబిజెపి. 7 వ వార్డు. రత్నం సుమాంజలి బిఆర్‌ఎస్, 8 వ వార్డు బెజ్జాల శ్యామల బిఆర్‌ఎస్, 9 వ వార్డు అప్పం కిషన్ (కాంగ్రెస్), 10 వ వార్డు. పుల్లూరి మంజుల మాధవరావు (కాంగ్రెస్),

11 వ వార్డు మోతె రాజుబీఆర్‌ఎస్, 12 వ వార్డు బొంతల సతీష్ బీఆర్‌ఎస్, 13 వ వార్డు బడితల వెంకటస్వామి (కాంగ్రెస్), 14 వ వార్డు మాకోటి శ్వేత ప్రభాకర్ (కాంగ్రెస్), 15 వ వార్డు. అంబాల శ్రీనివాస్(కాంగ్రెస్), 16 వ వార్డు. జ్యోతుల మంజుల బిఆర్‌ఎస్, 17 వ వార్డు బీర్తి కమల మధునయ్య. (కాంగ్రెస్),18 వ వార్డు ముంత సహదేవ్ (కాంగ్రెస్), 19 వ వార్డు కురుమిళ్ళ శ్రీనివాస్ (కాంగ్రెస్), 20 వ వార్డు ఇస్లావత్ రాజు నాయక్. (కాంగ్రెస్), 21 వ వార్డు దరావత్ శారద సమ్మయ్య. (కాంగ్రెస్), 22 వ వార్డు బుర్ర రమాదేవి సదానందం బిఆర్‌ఎస్, 23 వ వార్డు రాజేశ్వరి పద్మారెడ్డి (స్వతంత్ర అభ్యర్థి), 24 వ వార్డు. వేముల జ్యోతి శ్రీకాంత్ సిపిఐ, 25 వ వార్డు. పొనగంటి మేఘన. (కాంగ్రెస్), 26 వ వార్డు. ఓరుగంటి రాధ అయిలయ్య. (కాంగ్రెస్), 27 వ వార్డు. వాసాల ఈశ్వరమ్మ బిఆర్‌ఎస్, 28 వ వార్డు. భోగం నరేందర్బిఆర్‌ఎస్, 29 వ వార్డు. గండ్ర హరీష్ రెడ్డి బిఆర్‌ఎస్, 30 వ వార్డు. బొడ్డు అశోక్ (కాంగ్రెస్) లు గెలుపొందారు. మెజార్టీ స్థానాలు గెలుచుకున్న అధికా పార్టీ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మెన్ పీఠం దక్క నుంది.

Tags

Next Story