రామగుండం ‘హస్త’గతం

రామగుండం ‘హస్త’గతం
X

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన సత్తాను చాటుకుంది. 60వ డివిజన్లకు గాను 38 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకొని రామగుండం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండాను ఎగురవేసింది.

ఏ పార్టీకి ఎన్ని స్థానాలు

మొత్తం 60 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో నగర పాలక సంస్థను కైవసం చేసుకుంది. పార్టీల వారీగా గెలుపొందిన స్థానాలు ఇలా ఉన్నాయి. కాంగ్రెస్: 38 స్థానాలు, బీఆర్‌ఎస్: 13 స్థానాలు, ఏఐఎఫ్‌బీ: 06 స్థానాలు, బీజేపీ: 01, సీపీఐ: 01, ఇండిపెండెంట్: 01 స్థానం,

60 స్థానాల విజేతల పూర్తి వివరాలు

1వ డివిజన్ మడిపల్లి విజయ (కాంగ్రెస్ - ఏకగ్రీవం), 2. వెంగల బాపు (కాంగ్రెస్), 3. వడ్లూరి రవి (ఏఐఎఫ్‌బి), 4. కంకణాల మౌనిక (కాంగ్రెస్), 5. మాతురి సత్యప్రసాద్ (కాంగ్రెస్), 6. ఆవుల శ్యామని (బిఆర్ ఎస్), 7. వేగోలపు రమాదేవి (కాంగ్రెస్), 8. పర్లపల్లి పుష్పలత (ఏఐఎఫ్‌బి), 9. తాళ్లపల్లి యుగేంధర్ (కాంగ్రెస్), 10. అడ్డాల గట్టయ్య (బిఆర్ ఎస్), 11. కారెంగుల రమ్య (ఏఐఎఫ్‌బి), 12. షేక్ బాబు మియా (కాంగ్రెస్), 13. చుక్కల లావణ్య (కాంగ్రెస్), 14. బదావత్ శంకర్ నాయక్ (కాంగ్రెస్), 15. బుర్ర శశికళ (బిఆర్ ఎస్), 16. మందల రమ (బిఆర్ ఎస్), 17. అనుము స్వరూప (కాంగ్రెస్), 18. దేవనపల్లి చక్రపాణి (కాంగ్రెస్), 19. మారెల్లి సుశీల (కాంగ్రెస్), 20. తాళ్ల చిన్న రాజయ్య (బిఆర్ ఎస్), 21. కందుల స్వరూప (కాంగ్రెస్), 22. కన్నూరి భాగ్యలక్ష్మి (కాంగ్రెస్), 23. బెంద్రం సునీత (కాంగ్రెస్), 24. కొలని కవిత (కాంగ్రెస్), 25. సిరిశెట్టి సతీష్ (కాంగ్రెస్), 26. బదావత్ నర్సమ్మ (బిఆర్ ఎస్), 27. ఆయేషా ఖానం (ఇండిపెండెంట్), 28. బద్రి రాజన్న (ఏఐఎఫ్‌బి), 29. నిమ్మ రాజుల రజిని (బిఆర్ ఎస్), 30.

ఇస్సంపల్లి అంజయ్య (కాంగ్రెస్), 31. షాహెదా (కాంగ్రెస్), 32. తోట మమత (బీజేపీ), 33. మేరుగు భూలక్ష్మి (కాంగ్రెస్), 34. స్వప్న ప్రియ (కాంగ్రెస్), 35. జంగపల్లి రమాదేవి (కాంగ్రెస్), 36. కల్వల పద్మావతి (కాంగ్రెస్), 37. మీర్జా ఫజల్ బేగ్ (కాంగ్రెస్), 38. నెలకంటి రాము (కాంగ్రెస్), 39. తిప్పారపు మానస (కాంగ్రెస్), 40. కజపురం జయప్రద (బిఆర్ ఎస్), 41. మార్కపురి సూర్య (సీపీఐ), 42. పాతిపల్లి కావ్య (కాంగ్రెస్), 43. దొంత శ్రీనివాస్ (కాంగ్రెస్), 44. కర్రావుల దాడిరాజు (ఏఐఎఫ్‌బి), 45. కౌటం సతీష్ (కాంగ్రెస్), 46. మహాంకాళి స్వామి (కాంగ్రెస్), 47. దాసరి సాంబమూర్తి (కాంగ్రెస్), 48. రేణుకుంట్ల నిర్మల దేవి (కాంగ్రెస్), 49. సాగి సంతోష్ రావు (కాంగ్రెస్), 50. దూళికట్ట సతీష్ (కాంగ్రెస్), 51. ఆకారపు రజిత (బిఆర్ ఎస్), 52. చీదురాల నాగరాజు (ఏఐఎఫ్‌బి), 53. గట్ల రమేష్ (కాంగ్రెస్), 54. మహ్మద్ ముస్తాఫా (కాంగ్రెస్), 55. కర్క పద్మజ (బిఆర్ ఎస్), 56. కొమ్ము స్వప్న (కాంగ్రెస్), 57. పాతపల్లి ఎల్లయ్య (కాంగ్రెస్), 58. మేకల సమ్మయ్య (బిఆర్ ఎస్), 59. బాలసాని తిరుపతి (ఏఐఎఫ్‌బి), 60. మేకల శారద (బిఆర్‌ఎస్).

భార్యాభర్తల గెలుపు.. 2 ఓట్ల మెజారిటీతో ఉత్కంఠ

ఈ ఎన్నికల్లో కొన్ని ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. 58 మరియు 60 స్థానాల నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మేకల సమ్మయ్య, శారద దంపతులు ఇద్దరూ విజయం సాధించి విశేష గుర్తింపు పొందారు. ఇక 59వ స్థానంలో ఏఐఎఫ్‌బీ అభ్యర్థి బాలసాని తిరుపతి కేవలం 2 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కి నగరంలో అత్యల్ప మెజారిటీ విజేతగా నిలిచారు.

బిఆర్‌ఎస్, బిజెపిలపై ఎమ్మెల్యే నిప్పులు

ఫలితాల అనంతరం గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. బిఆర్‌ఎస్ పార్టీ అహంకారానికి, బిజెపి చేస్తున్న మత రాజకీయాలకు రామగుండం ప్రజలు ఈ తీర్పుతో బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. అభివృద్ధిని వదిలేసి మతం పేరుతో చిచ్చు పెట్టాలని చూసిన బిజెపిని, ప్రలోభాలతో గెలవాలని చూసిన బిఆర్‌ఎస్‌ను ఓటర్లు తిరస్కరించారని ఎద్దేవా చేశారు. రామగుండం లౌకికత్వానికి ప్రతీక అని, ఇక్కడ విభజన రాజకీయాలు సాగవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

పోలీసుల పటిష్ట బందోబస్తు

కౌంటింగ్, ఫలితాల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం పటిష్ట బందోబస్తు చేపట్టింది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ స్వయంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించగా, పెద్దపల్లి డీసీపీ బి.రాంరెడ్డి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ శాంతిభద్రతల పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. అల్లరిమూకలపై పోలీసులు ముందస్తు నిఘా ఉంచడంతో నగరం ప్రశాంతంగా ఉంది.

Tags

Next Story