జనగాం మున్సిపాలిటీ కాంగ్రెస్ దే

జనగాం మున్సిపాలిటీ కాంగ్రెస్ దే
X

జనగాం: లాటరీ పద్ధతిలో జనగాం మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్మన్ గా కడమంచి బాలమణిని ఎన్నికున్నారు. వైస్ చైర్మన్ కోసం సైతం లాటరీ పద్దతిలో ఎన్నిక జరుగనుంది. జనగామ మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు సమానమైన సంఖ్య రావడంతో లాటరీ పద్దతి ప్రవేశ పెట్టారు. లాటరీ పద్దతి కాంగ్రెస్ పేరు రావడంతో చైర్మన్ పదవి ఆ పార్టీ కైవసం చేసుకుంది. బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపిన స్వతంత్ర అభ్యర్థులపై కాంగ్రెస్ నాయకలు దాడికి పాల్పడ్డినట్టు బిఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు.




Tags

Next Story