సదాశివపేటలో కాంగ్రెస్ ఘన విజయం

సదాశివపేటలో కాంగ్రెస్ ఘన విజయం
X

సదాశివపేట: తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. కార్పొరేషన్లలో కాంగ్రెస్ నాలుగింట్లో అధిక్యంలో ఉంది. మున్సిపాలీటీలలో 56 కాంగ్రెస్, తొమ్మిది బిఆర్ఎస్, ఒకటి బిజెపి, ఒకటి ఎంఐఎం పార్టీలు అధిక్యంలో ఉన్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్​ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీలో 16 వార్డులు గెలిచి మున్సిపల్ చైర్మన్ సీటును కైవసం చేసుకుంది. మొత్తం 26 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 16 వార్డులు, బిఆర్ఎస్ 8 వార్డులు బిజెపి ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులలో విజయం సాధించారు.





Tags

Next Story