సుల్తానాబాద్ లో హస్తందే హవా

సుల్తానాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు వెలువడుతున్నాయి. కార్పొరేషన్లలో కాంగ్రెస్ మూడింట్లో అధిక్యంలో ఉంది. మున్సిపాలీటీలలో 53 కాంగ్రెస్, తొమ్మిది బిఆర్ఎస్, ఒకటి బిజెపి, ఒకటి ఎంఐఎం పార్టీలు అధిక్యంలో ఉన్నాయి. అధిక చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు జోరు ప్రదర్శిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మొత్తం 15 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 12 వార్డులు గెలుపొందగా బిఆర్ఎస్, బిజెపి, ఫార్వర్డ్ బ్లాక్ తలో ఒకటి గెలుపొందాయి.
సుల్తానాబాద్ వివిధ పార్టీల నుంచి గెలిచిన అభ్యర్థుల వివరాలు:
01) ఈర్ల స్వరూప (కాంగ్రెస్)
02) గాజుల రాజమల్లు ( కాంగ్రెస్)
03) కందునూరి సమత (బీజేపీ)
04) బిరుదు కృష్ణ (కాంగ్రెస్)
05) గరిగే శోభారాణి (కాంగ్రెస్)
06) బాకం సాయి కిరణ్ (కాంగ్రెస్)
07) వర ప్రదీప్ (కాంగ్రెస్)
08) చింతల రాజు (కాంగ్రెస్)
09) టికే ప్రభాకర్. (కాంగ్రెస్)
10) అంతటి పుష్పలత(కాంగ్రెస్) .
11) కల్వల శంకరమ్మ (బిఆర్ఎస్)
12) అమీరిశెట్టి శ్రావణి (ఎఐఎఫ్ బిపి)
13) సిద్ధ తిరుపతి ( కాంగ్రెస్)
14) వేగోళం పద్మ (కాంగ్రెస్)
15) గాదాసు మంజుల (కాంగ్రెస్)
-
Home
-
Menu
