జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం

జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం
X

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకుంది. చివరి క్షణంలో తటస్థంగా ఉన్న స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో కాంగెస్ ను అదృష్టం వరించింది. మొత్తం 37 వార్డుల్లో 15 బిఆర్ఎస్, 14 కాంగ్రెస్, 3 బిజెపి, 2 ఎంఐఎం, 3 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. ఎంఐఎం పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లతో పాటు స్వతంత్ర కౌన్సిలర్లు ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపడంతో 19 మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరింది. దీనికి తోడు ఎంపి సురేష్ షెట్కార్ ఎక్స్ అఫిషియో ఓటుతో కాంగ్రెస్ మెజారిటీ 20కి పెరిగింది. బిజెపి పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ కు మద్దతు తెలపడంతో ఆ పార్టీ బలం 18కి పెరిగింది. జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్ రావు ఎక్స్ అఫిషియో ఓటుతో బిఆర్ఎస్ బలం 19కి పరిమితమైంది. అధికార పార్టీకి మద్దతు పలికిన స్వతంత్ర అభ్యర్థి కొత్త కాపు శిరీష కు వైస్ చైర్మన్ అవకాశం దక్కింది.

Tags

Next Story