తప్పతాగి నడివీధిలో భార్యను చితకబాదిన కానిస్టేబుల్

ప్రజల మాన ప్రాణాలకు రక్షణనివ్వాల్సిన పోలీసే తప్పతాగి నడివీధిలో భార్యను చితకబాదిన వైనం ఆ శాఖ పరువును గంగలో కలిపింది. బాధ్యత కలిగిన ఉద్యోగంలో ఉన్నానన్న విషయాన్ని విస్మరించి అర్థనగ్నంగా వీధుల్లో సంచరించన ఘటన మంచిర్యాల పట్టణంలో చోటుచేసుకుంది. ఒక పోలీస్ హల్‌చల్ ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. భార్యను వీధిలోకి లాక్కొచ్చి విచక్షణారహితంగా బాదిన వైనం పట్ల కాలనీ వాసులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ రవిప్రసాద్ చర్యలను స్థానికులు చిత్రించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో హేయమైన చర్య బహిర్గతమైంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డికాలనీ రోడ్ నెంబర్ 14లో నివాసముంటున్న కానిస్టేబుల్ రవిప్రసాద్ తప్పతాగి అర్దనగ్నంగా వీధిలో తిరుగుతూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశాడు.
తాగిన మైకంలో.. భార్యను ఇంటి నుండి బయటకు లాక్కొచ్చి అమానూషంగా కొట్టడంతో.. తల్లి చంకలో వున్న చిన్నారి కేకలు విని స్థానికులు కానిస్టేబుల్ ను అడ్డుకున్నారు. అప్పటికే కానిస్టేబుల్ విచక్షణారహితంగా భార్యను కొడుతున్న దృశ్యాలను కొందరు చిత్రీకరించారు. కానిస్టేబుల్ రవిప్రసాద్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. రక్షకభటుడే సంస్కారహీనంగా ప్రవర్తించడం పట్ల బస్తీ మహిళలు ఆగ్రహాం వ్యక్తం చేసారు. రవిప్రసాద్ చర్య పోలీస్ శాఖ పరువు తీసిందని పలువురు దుయ్యబట్టారు. రవిప్రసాద్ వ్యవహారించిన తీరువల్ల తాము భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు భయందోళన వ్యక్తం చేసారు. కానిస్టేబుల్ అతి ప్రవర్తనపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని.. ప్రజలలో పోలీస్ శాఖకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని స్థానికులు కోరారు.
-
Home
-
Menu
