కామారెడ్డిలో ఆగి ఉన్న లారీని ఢీకొని కానిస్టేబుల్ మృతి

X
Constable dies after collided lorry in Kamareddy
కామారెడ్డి: ఆగి ఉన్న లారీని ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పెద్ద కొడఫ్గల్ బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..పిట్లం పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్ బిచ్కుంద నుంచి పిట్లం వెళ్లే దారిలో హైవేపై ఆగి ఉన్న బ్రేక్ డౌన్ లారీని వెనుక వైపు నుంచి కానిస్టేబుల్ వెళ్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా హోంగార్డ్ మధుకు గాయాలైనట్లు తెలిపారు. హోంగార్డ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వాహనాలను పక్కకు తొలగించారు.
Tags
Next Story
-
Home
-
Menu
