మంచిర్యాలలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం.... పసికందుతో ధర్నాకు దిగిన ప్రియురాలు

మంచిర్యాలలో ప్రేమ పేరుతో కానిస్టేబుల్ మోసం.... పసికందుతో ధర్నాకు దిగిన ప్రియురాలు
X

మంచిర్యాల: ఓ కానిస్టేబుల్ మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో ఓ యువతిని లొంగదీసుకున్నాడు. అనంతరం సదరు యువతిని గర్భవతిని చేసి అనంతరం బిడ్డ పుట్టగానే వదిలేసి పారిపోయాడు. దీంతో పసికందుతో తల్లి ధర్నాకు దిగిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ముదిగుంట గ్రామానికి చెందిన సాయిరాజ్ అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి ఓ యువతిని లొంగదీసుకున్నాడు. సదరు యువతిని గర్భవతి చేసి బిడ్డ పుట్టగానే వదిలేసి పారిపోయాడు. దీంతో కానిస్టేబుల్ ఇంటి ముందుకు చేరుకొని పసికందుతో ధర్నాకు దిగింది. దీంతో కానిస్టేబుల్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పారిపోయాడు. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్ చేసింది.


Tags

Next Story