గంజాయి బ్యాచ్ కారుతో ఢీ... కానిస్టేబుల్ సౌమ్య పరిస్థితి విషమం

X
హైదరాబాద్: గంజాయి బ్యాచ్ దాడిలో గాయపడిన ఎక్సైజ్ మహిళా కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గంజాయి బ్యాచ్ కారుతో కానిస్టేబుల్ ను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రెండు కిడ్నీలు దెబ్బతినడంతో మెరుగైన వైద్యం కోసం సౌమ్యను హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం నిజామాబాద్‌లో గంజాయి ముఠా బరి తెగించింది. ఎక్సైజ్ సిఐ స్వప్న తన సిబ్బందితో కలిసి గంజాయి బ్యాచ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానిస్టేబుల్ సౌమ్యను గంజాయి బ్యాచ్ సోహెల్, రాహిల్, మతిన్‌తో మరొకరు కారుతో ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సిఐ స్వప్న ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.
Tags
Next Story
-
Home
-
Menu
