భైంసా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

భైంసా దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
X

నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం జిల్లాలోని భైంసా సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కంటైనర్, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరణించిన వారిని కుబీర్ మండలంలోని కుప్టి గ్రామానికి చెందిన పటేల్, రాజన్న, బాబన్న, వికాస్ లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story