పాక్- బలోచ్ యుద్ధంలో 47 మంది మృతి

పాక్- బలోచ్ యుద్ధంలో 47 మంది మృతి
X

పాక్ సైన్యం లక్ష్యంగా బలూచ్ ఆర్మీ మరోసారి భారీ దాడులకు దిగింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ నిర్వహించిన సమన్వయ దాడిలో 10 మంది పాక్ సైనికులు , 37 మంది తిరుగుబాటుదారులు మరణించారు. భద్రతా దళాలకు ,తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక చోట జరిగిన దాడి కాదు. బిఎల్ఎ ఉగ్రవాదులు బలూచిస్తాన్‌లోని పలు జిల్లాల్లోని పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు మరియు హైవేలపై ఏకకాలంలో సమన్వయ దాడులకు పాల్పడ్డారు. బలోచిస్తాన్ ప్రావిన్షియల్ రాజధాని అయిన క్వెట్టాతో పాటు పస్ని, మస్తుంగ్, నుష్కీ, గ్వాదర్ జిల్లాల్లోని 12 కంటే ఎక్కువ ప్రాంతాల్లో బలోచ్ వేర్పాటు వాదులు ఒకేసారి దాడులు చేశారు.

ముసఖైల్ జిల్లాలో హైవేని దిగ్బంధించి, వాహనాల నుంచి ప్రయాణికులను కిందకు దించి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేసి మరీ కాల్పులు జరిపారు. పాకిస్థాన్ ప్రభుత్వం తమ ప్రాంతంలోని సహజ వనరులను దోచుకుంటోందని, చైనా పెట్టుబడుల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపిస్తూ బిఎల్ఎ ఈ విధ్వంసానికి పాల్పడుతోంది.ఈ భీకర దాడులకు బాధ్యులం తామేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

Tags

Next Story