భూమిని ఆక్రమించారని.. పెట్రోల్ పోసుకొని దంపతుల ఆత్మహత్యయత్నం

X
జగిత్యాల అర్బన్ మండలం మోతె పంచాయతీ కార్యాలయంలో దంపతుల ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమిని అక్రమంగా సొంత బాబాయ్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారన్న ఆవేదనతో రాజేష్ ఆయన భార్య శిరీష కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకోగా.. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు తన తండ్రి మరణం తర్వాత తమ కుటుంబానికి సంబంధించిన 25 గుంటల భూమితో పాటు ఇల్లును సొంత బాబాయ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భూమిని, పంచాయతీ సిబ్బంది లంచాలకు ఆశపడి వేరే వ్యక్తుల పేరు మీద మార్పిడి చేశారని బాధితులు ఆరోపించారు. న్యాయం కోసం ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. స్థానికులు వారి కళ్లను నీటితో కడిగి, ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
Next Story
-
Home
-
Menu
