అనుమానాస్పద స్థితిలో దంపతులు ఆత్మహత్య

అనుమానాస్పద స్థితిలో దంపతులు ఆత్మహత్య
X

అనుమానాస్పద స్థితిలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బంట్వారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం (58), భార్య నక్కలి లక్ష్మి(54) అనుమానస్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు కలిసి శనివారం ఉదయం పొలానికివెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. ఇంట్లోనే ఉన్న కూతురు నక్కలి సురేఖతో కలిసి భోజనం చేశారు. అప్పులున్నా, కుమార్తె పెళ్లి చేయాల్సి ఉందంటూ మాట్లాడుతున్నారు. వీరికి నలుగురు సంతానమైతే, ముగ్గురి పెళ్లిళ్లయ్యాయి. ఒక కూతురు పెళ్లికి ఉంది. చిన్న కూతురు సురేఖతో భోజనం చేసి తరువాత దశరథం ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు.

ఆయన పడిపోయిన వెంటనే తల్లి నక్కలి లక్ష్మి కూడా పడిపోయింది. కూతురు చుట్టుపక్కల వారికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకునేసరికే ఇద్దరు మృతి చెందారు. అప్పుల బాధ తట్టుకోలేక ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్టు కొడుకు నక్కలి అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నక్కలి దశరథానికి యూనియన్ బ్యాంక్‌లో రూలక్ష, నక్కలి లక్ష్మికి బంట్వారం ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో రూ.లక్ష 50 వేలు పంటపై రుణాలు, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర రూ.6 లక్షలకు పైగా వడ్డీకి అప్పు ఉన్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వీరి మృతిపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. కొడుకు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ధారూర్ సీఐ రఘురాములు, బంట్వారం ఎస్‌ఐ విమల తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకుకు అందజేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story