పెద్దపులి దాడిలో ఆవు మృతి

X
మంచిర్యాల జిల్లా, జన్నారం అటవీ డివిజన్, ఇందన్‌పల్లి రేంజ్‌లోని ఇందన్‌పల్లి నార్త్ బీట్‌లో మంగళవారం రాత్రి ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇందన్‌పల్లి ఇన్‌ఛార్జి రేంజ్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పెద్దపులి జన్నారం అడవుల్లో తిరుగుతోందని, ఎట్టి పరిస్థితులలో అడవిలోకి ఒకరిద్దరు వంతున వెళ్లవద్దని, పశువుల కాపరులు అడవిలోకి వెళ్లకూడదని అన్నారు. అదేవిధంగా పులి సంచరిస్తోందంటూ ప్రజలు భయబ్రాంతులకు గురికావద్దని, వేట కోసం కరెంటు వైర్లు, ఉచ్చులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పులి దాడిలో మృతి చెందిన ఆవు యజమానికి ప్రభుత్వపరంగా పరిహారం చెల్లిస్తామని రేంజ్ తెలిపారు.
Next Story
-
Home
-
Menu
