సిపిఐ మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు

ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మహిళ మావోయిస్టు సభ్యురాలు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమవారం జిల్లా పొలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ లొంగుబాటు వివరాలు వెల్లడించారు. ములుగు జిల్లా పోలీసులు ఆదివాసీ ప్రజల అభివృది, సంక్షేమం కోసం చేపట్టిన పోరు కన్నా ఊరు మిన్నా, మన ఊరికి తిరిగి రండి కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల గురించి తెలుసుకొని, మావోయిజాన్ని విడిచి ప్రశాంత జీవనం గడపాలనే ఉద్దేశంతో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టికి చెందిన మహిళా సభ్యురాలు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మడకం సోమి పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. రాష్ట్రానికి చెందిన సభ్యురాలు ములుగు జిల్లా ఎసీ డా. శబరిష్ పి, ఐపిఎస్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరెండర్ పాలసీలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టుల దళ సభ్యురాలికి రూ. 25 వేలు ఆర్ధిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు వనం వీడి జనంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఇంచార్జ్ ఓఎస్డీ, డిఎస్పీ నలువాల రవిందర్, ఆర్‌ఐ తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.
-
Home
-
Menu
