నేటి నుంచి రాజమండ్రిలో క్లైమాక్స్ షూటింగ్

వరుస బ్లాక్‌బస్టర్‌లు, పాన్-ఇండియా స్టార్‌డమ్‌తో దూసుకుపోతున్న వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్, స్వప్న సినిమా సమర్పణలో, ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. ఇంతకు ముందు విడుదలైన ప్రోమోలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా క్లైమాక్స్ షూటింగు సోమవారం నుంచి రాజమండ్రిలో ప్రారంభం కానుంది. హీరో హీరోయిన్‌లపై క్లైమాక్స్ షూట్ చేయబోతున్నారు. డైరెక్టర్ పవన్ సాదినేని ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ని రెడీ చేశారు. బలమైన కథ, పర్ఫార్మెన్స్‌లు ఉన్న క్రేజీ ప్రాజెక్టు ఇది. శృతి హాసన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఈ వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
-
Home
-
Menu
