ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా

వింజ్ బ్లాక్ బస్టర్ కపుల్ హీరో శివాజీ, హీరోయిన్ లయ జంటగా నటిస్తున్న చిత్రం ’సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధీర్ శ్రీరామ్ రచన, దర్శకత్వం వహించారు. బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్, రఘుబాబు, ౩౦ ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 12న ఈటీవి విన్ ఓటీటీ వేదికగా ఈ క్రైమ్ కామెడీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ డేట్, సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సమావేశంలో హీరో శివాజీ మాట్లాడుతూ “ఫ్యామిలీ అంతా కూర్చుని సంక్రాంతి పండక్కి ఫ్యామిలీ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాంటి సినిమా ఇది. ఈ సాంగ్ 20 సంవత్సరాలు క్రితం విన్నది. వాళ్ళ దగ్గర రైట్స్ తీసుకుని కంపోజిషన్ చేయడం జరిగింది”అని అన్నారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ “ఈ కథ విన్నప్పుడే నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో నేను చేసిన ఉత్తర నా కెరీర్‌లో చాలా స్పెషల్ క్యారెక్టర్ అవుతుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, డైరెక్టర్ సుధీర్ శ్రీరామ్, ప్రిన్స్, భోలే షావలి, రోహన్ పాల్గొన్నారు.
-
Home
-
Menu
