గద్వాల జిల్లాలో మొసలి కలకలం

X
గద్వాల: తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని జోగులాంబ గద్వాల జిల్లా తుంగభద్ర నదిలో నాగలాదిన్నె బ్రిడ్జి సమీపంలో మొసలి కనిపించింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మొసలి కొట్టుకొచ్చింది. మొసలి కనిపించిన వెంటనే రైతులు, గ్రామస్థులు అప్రమత్తమై సమన్వయంతో దాన్ని బంధించారు. మొసలి పట్టుబడటంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. పట్టుకున్న మొసలిని అటవీశాఖ అధికారులకు గ్రామస్థులు అప్పగించారు.
Tags
Next Story
-
Home
-
Menu
