తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?

Huge Crowd at Tirumala Temple
X

Huge Crowd at Tirumala Temple

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. గురువారం తెల్లవారుజాము నుంచి తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి వచ్చిన భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక, బుధవారం శ్రీవారిని 67,632 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో స్వామివారికి 24,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారిని హుండీ ఆదాయం రూ.2.91 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.


Tags

Next Story