తిరుమల శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

X
Tirumala Temple
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ మళ్లీ పెరిగింది. సంక్రాంతి పండగ తర్వాత తిరుమల ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం వీకెండ్ కావడంతో తిరుమలకు భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల నుంచి 9 గంటల సమయం పడుతుంది.
ఇక, శుక్రవారం తిరుమల వెంకన్నను 69,254 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 20,954 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Next Story
-
Home
-
Menu
