మణుగూరులో గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా... తప్పిన పెను ప్రమాదం

మణుగూరులో గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా... తప్పిన పెను ప్రమాదం
X

మణుగూరు: గ్యాస్ సిలిండర్ల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. గ్యాస్ సిలిండర్ల పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అశోక్ నగర్ లో జరిగింది. గ్యాస్ సిలిండర్ల లారీ విజయవాడ నుంచి ములుగుకు వెళ్తుండగా అశోక్ నగర్ శివార్లలో బోల్తాపడింది. వెంటనే స్థానికులు పోలీసులు, గ్యాస్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. మరో లారీలో గ్యాస్ సిలిండర్లను తీసుకెళ్లారు. గ్యాస్ సిలిండర్లు పేలకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని స్థానికులు వాపోతున్నారు. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.


Tags

Next Story