దలైలామా అరుదైన రికార్డు.. ప్రతిష్టాత్మక అవార్డు

Dalai Lama
X

ప్రముఖ బౌధ మత గురువు దలైలామా అరుదైన రికార్డు సాధించారు. ప్రతిష్టాత్మక గ్రామీ వార్డును ఆయన గెలుచుకున్నారు. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ జాబితాలో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో తొలి గ్రామీ అవార్డు అందుకొని రికార్డు నెలకొల్పారు. ఇది సంగీత రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ ఇది ఒక మైలురాయిగా నిలిచింది.


‘మెడిటేషన్’.. అనే ఆల్బమ్‌కు గాను దలైలామాను ఈ అవార్డు దక్కింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు. శాంతి, ధ్యానం, దయ, అంతర్ముఖ పరిశీలన వంటి అంశాలపై ఆయన స్వయంగా చెప్పిన భావాలను ఈ స్కోకెన్-వర్డ్ ఆల్బమ్‌తో ప్రజలకు అందించారు. దలైలామా చేసిన ఈ ప్రసంగాలకు.. సరోద్ వాయిద్యకారుడు అంజద్ అలీఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

Tags

Next Story