అధికారిక లాంఛనాలతో దామన్న అంత్యక్రియలు

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి (దామన్న) అంత్యక్రియలు సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి మండల కేంద్రంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో శనివారం మధ్యాహ్నం అధికారిక లాంఛనాలతో ముగిశాయి. దామోదర్‌రెడ్డి కుమారుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. తమ ప్రియతమ నాయకుడి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు వేలాదిగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తుంగతుర్తికి తరలివచ్చారు. ఉదయం ఆరు గంటల నుండే దామోదర్‌రెడ్డి కడసారి చూపు కార్యక్రమం సుమారు మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. దామన్న అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్టీ ఎంఎల్‌ఎలు పద్మావతి రెడ్డి, మందుల సామేలు, నాయిని రాజేందర్ రెడ్డి, వేముల వీరేశం, మామిడాల యశస్విని రెడ్డి, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపి బలరాం నాయక్,
నల్లగొండ ఎంపి రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా ఎస్‌పి నరసింహ, మాజీ ఎంఎల్‌ఎ చందర్రావు, ఎంఎల్‌సి శంకర్ నాయక్, సూర్యాపేట ఎంఎల్‌ఎ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ గాదరి కిషోర్ కుమార్, రాష్ట్ర రైతు కమిషన్ మెంబర్, దామోదర్‌రెడ్డి సోదరుడు రామ్‌రెడ్డి గోపాల్‌రెడ్డి, సూర్యాపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారరెడ్డి, సూర్యాపేట డిసిసి అధ్యక్షుడు, రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, దామోదర్‌రెడ్డి సోదరులు కృష్ణారెడ్డి, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి రామ్‌రెడ్డి సుచరితారెడ్డి, స్పోర్ట్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, మిర్యాలగూడ ఎంఎల్‌ఎ బిఎల్‌ఆర్, పర్యాటక సంస్థ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో పాటు దామోదర్‌రెడ్డి బంధువులు, పలువురు కాంగ్రెస్ ప్రముఖులు, విపక్షాల ప్రముఖ నేతలు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు వేలాదిగా అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దామన్న అమర్ రహే నినాదాలతో అంత్యక్రియల కార్యక్రమం మార్మోగింది.
Tags
-
Home
-
Menu
