రేవంత్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం : దానం

X
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి రాజీ నామా ప్రస్తావన ఇంకా రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తనకు ఎన్నికలు కొత్త కాదు అని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్, నారాయణగూడలో రూ.1.40 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ, రోడ్ల పనలకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం అనర్హత వేటు అంశంపై దానం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం అని తెలియజేశారు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం తన రక్తంలోనే ఉందని,11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర ఉందని దానం పేర్కొన్నారు. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయని, రేవంత్ రెడ్డి మరో పదేళ్లు సిఎం కొనసాగితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని దానం నాగేందర్ స్పష్టం చేశారు.
Next Story
-
Home
-
Menu
