అత్త పక్కనే పడుకున్న చిరుత.... కాపాడిన కోడలు

X
బెంగళూరు: చిరుత పులి బారి నుంచి అత్తను కోడలు కాపాడిన సంఘటన కర్నాటక రాష్ట్రం మైసూరు నగరంలో జరిగింది. అటవీ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.... రాచనగరి మైసూరు నగరంలోని సిద్ధార్థనగర్‌లో సుజాత అనే మహిళ తన భర్త, అత్త శైలజతో కలిసి ఉంటుంది. అత్త పడుకున్న రూమ్‌లో కోడలు వెళ్లింది. మంచం కింద చిరుత పులిని గమనించి అత్తను చాకచక్యంగా బయటకు తీసుకొచ్చింది. అనంతరం ఆ రూమ్ గడియ వేసి పోలీసులు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చింది. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని చిరుతకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్నారు. సుజాత సమయస్ఫూర్తిని స్థానికులు, అటవీ శాఖ అధికారులు ప్రశంసించారు. చిరుత పులి చూసిన కూడా ప్రాణ భయం లేకుండా అత్తను కాపాడిన కోడలు ధైర్య సహసాలను స్థానికులు ప్రశంసిస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
