కొన ఊపిరితో ఉన్న తల్లిని ఆర్టీసీ బస్టాండ్ లో వదిలేసిన కూతురు

కొన ఊపిరితో ఉన్న తల్లిని  ఆర్టీసీ బస్టాండ్ లో వదిలేసిన  కూతురు
X

ఇది నిజంగా గుండెను కలిచివేసే అత్యంత బాధాకరమైన ఘటన. కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని కుమార్తె ఆర్టీసీ బస్టాండ్ లో వదిలేసిన జోగులాంబ గద్వాల్ జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మానవత్వం సిగ్గుపడేలా జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని పెద్ద ఆముదాలపాడుకి చెందిన పుణ్యవతి(62), రామిరెడ్డి దంపతులు. వీరికి కుమార్తె ఆమె పేరు కవిత. రామిరెడ్డి కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. 14 సంవత్సరాల క్రితం కవిత తన తల్లి పుణ్యవతి, భర్త శ్రీనివాసరెడ్డితో కలిసి మానవపాడుకు వచ్చి నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరెడ్డి ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు. అయితే భర్త శ్రీనివాసరెడ్డి 7 సంవత్సరాల క్రితం మరణించాడు.అప్పటి నుంచి ఇద్దరు అక్కడే ఉంటూ ఎదోఒక పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో తల్లి పుణ్యవతి అనారోగ్యానికి గురి అవ్వబంతో ఇటీవల చికిత్స నిమిత్తం కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్యులు పరీక్షించి ఆమె ఆరోగ్యం క్షీణించిందని వైద్యం చేయలేమని ఇంటికి పంపించారు. దీంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో బుధవారం రాత్రి కొన ఊపిరితో ఉన్న తల్లిని ఆర్టీసీ బస్టాండులో వదిలేసి వెళ్లింది. కాసేపటి తర్వాత పుణ్యావతి మరణించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బస్టాండ్ లో వదిలి వెళ్లిన కూతురు కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మృతదేహాన్ని పెద్దఆముదాలపాడుకు తరలించారు.

Tags

Next Story