రజనీకాంత్ ‘జైలర్-2’ పాటకు డేవిడ్ వార్నర్ డ్యాన్స్ చేస్తే..

ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అంటే క్రికెట్ అభిమానులకే కాదు.. సినీ ప్రియులకు కూడా ఎంతో ఇష్టం. లాక్‌డౌన్ సమయంలో ఆయన పలు పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ అప్‌లోడ్ చేసిన వీడియో ఎంతో వైరల్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి వార్నర్‌ని డేవిడ్ భాయ్ అని పిలవడం ఫ్యాన్స్‌కి అలవాటు అయింది. గత ఏడాది నితిన్ హీరోగా వచ్చిన ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాలో ఈ ప్రత్యేక పాత్రలో కనిపించారు వార్నర్. అయితే ఆ సినిమా ఊహించినంత సక్సెస్ సాధించలేదు.
ఇప్పుడు డేవిడ్ వార్నర్ మరో వీడియోతో ఫ్యాన్స్ ముందుకొచ్చారు. ‘జైలర్-2’ చిత్రంలోని ‘అల బోలేలో’ పాటకి వార్నర్ డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అనేలా ఓ ఎఐ వీడియోని క్రియేట్ చేశారు. దీన్ని వార్నర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘ఇది ఎవరు చేశారో నాకు తెలీదు.. కానీ, నా డ్యాన్స్‌కు ఎన్ని మార్కులు ఇస్తారు’ అని క్యాప్షన్ పెట్టాడు. దీనిపై అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
-
Home
-
Menu
