ఆదిలాబాద్‌లో డిసిఎం, ట్రావెల్స్ బస్సు ఢీ

X
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దూదిగామ శివారులో డిసిఎం, ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వేగం తక్కువగా ఉండడంతో ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సహారా ట్రావెల్స్ బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుంగా డిసిఎం హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags
Next Story
-
Home
-
Menu
