రోడ్డు ప్రమాదంలో దంత వైద్యురాలు మృతి

రోడ్డు ప్రమాదంలో దంత వైద్యురాలు మృతి
X

అమరావతి: రోడ్డు ప్రమాదంలో దంతవైద్యురాలు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కారు అదుపుతప్పి ముందున్న వాహనాన్ని ఢీకొట్టి అనంతరం ఢివైడర్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాగల్లు చెందిన జోన్నకూలి లిఖిత(23) ఓ ప్రైవేటు కాలేజీలో లిఖిత డెంటల్ కోర్సు చదువుతోంది. ఓ ప్రైవేటు హాస్టల్ లో ఉండి చదువు కొనసాగిస్తున్నారు. కారులో ఆమె తన ముగ్గురు స్నేహితులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి వసతి గృహానికి కారులో వెళ్తుండగా రాజానగరం, దివాన్ చెరువు మధ్య గుర్తు తెలియని వాహనానికి కారు ఢీకొంది. అనంతరం డివైడర్ ఢీకొట్టి బోల్తా పడింది. ముందు సీట్లో కూర్చున్న లిఖిత ఘటనా స్థలంలో మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story