ఎసిబి వలలో డిప్యూటీ తహసీల్దార్

ఆర్‌టిఎ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి ఒక రైతును రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఎసిబి వలలో చిక్కుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన ఎసిబి అధికారులు తెలిపిన ప్రకారం వివరాల్లోకి వెళ్తే..నల్లగొండ జిల్లా, చండూర్ డిప్యూటీ తహసీల్దార్‌గా చంద్రశేఖర్ విధులు నిర్వహిస్తున్నాడు. గట్టుప్పల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన వ్యవసాయ భూమి తన తండ్రి పేరు మీద నుంచి వేరే వ్యక్తులకి బదిలీ అయ్యింది. ఈ భూమి ఏ విధంగా ఏ సంవత్సరంలో బదిలీ అయ్యిందో తెలపాలని ఆర్టీఐ చట్టం కింద బాధితుడు సమాచారం కోరాడు. అందుకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రోజులు గడుపుతున్నాడు.. దీంతో బాధితుడు ఆ అధికారిని నిలదీయగా రూ.20 వేలు లంచం ఇస్తే సమాచారం ఇస్తానని స్పష్టం చేశాడు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. డిప్యూటీ తహసీల్దార్ చెప్పిన విధంగా సదరు రైతు రూ.20 వేలు నగదు తీసుకొని హైదరాబాద్ బాలాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద డిప్యుటీ తహసీల్దార్ ఇంటికి వెళ్లాడు. ఎసిబి అధికారులు పథకం ప్రకారం దాడి చేసి బాధితుడు లంచం డబ్బులు ఇచ్చే సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతనిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలిస్తున్నట్టు ఎసిబి అధికారులు తెలిపారు.
-
Home
-
Menu
