‘దేవర’ వచ్చి ఏడాది.. ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్..

‘దేవర’ వచ్చి ఏడాది.. ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్..
X

హైదరాబాద్: ఎన్టిఆర్ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ 27న విడుదలై చరిత్ర సృష్టించింది. చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్టిఆర్ ఫ్యాన్స్‌కి చిత్ర యూనిట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘దేవర-2’ పోస్టర్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీంతో ఎన్టిఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ‘‘దేవర ప్రతి సముద్ర తీరాన్ని వణికించి నేటికి ఏడాది పూర్తయింది. ప్రపంచం ఎప్పటికీ గుర్తు పెట్టుకునే పేరు ఇది. తాను పంచిన ప్రేమ, తాను చూపిన భయం.. ఎప్పటికీ మర్చిపోలేరు. ‘దేవర-2’ కోసం అందరూ సిద్ధంగా ఉండండి’’ అని చిత్ర నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది.

దీంతో త్వరలోనే ఈ సీక్వెల్ పనులు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఎన్టిఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే పలు షెడ్యూళ్లు షూటింగ్ పూర్తి చేసుకుంది. పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా 2026 జూన్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత ఎన్టిఆర్ ‘దేవర-2’ టీంతో జతకడతారు. దర్శకుడు కొరటాల శివ దేవర-2 గురించి పలు సందర్భాల్లో మాట్లాడి.. సినిమాపై హైప్‌ని పెంచేశారు. దేవరలో చూసింది 10 శాతమే అని.. సీక్వెల్‌లో 100 శాతం చూస్తారని ఆయన అన్నారు.


devara movie


Tags

Next Story