బాసరలో భక్తుల సందడి

X
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శుభ ముహుర్తాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం భక్తుల సందడి నెలకొంది. శుభముహుర్తాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అదిక సంఖ్యలో విచ్చేశారు. ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి నది ఒడ్డున గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు తమ పిల్లలకు అక్షర శ్రీకార పూజలు జరిపించారు. భారీగా భక్తులు రావడంతో అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. అనంతరం అమ్మవారి సత్రంలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో విజయ రామరావు, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Next Story
-
Home
-
Menu
