బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు

బాసర ఆలయానికి పోటెత్తిన భక్తులు
X

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగింది. తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి , నది తీరాన ఉన్న శివాలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి చేరుకొని దర్శనం చేసుకున్నారు. అక్షరాభ్యాసం నిర్వహించేందుకు వచ్చిన చిన్నారుల తల్లిదండ్రులు ఆలయంలోని అక్షరాభ్యాస మండపంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అక్షరాభ్యాసాలు, దర్శనాల కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. దర్శనం, అక్షరాభ్యాసం కార్యక్రమాలు సజావుగా జరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కళకళలాడగా, భక్తులు భక్తి శ్రద్దలతో అమ్మవారిని దర్శించుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.

Tags

Next Story